- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ ఓకే.. మరి భౌతిక దూరం?
న్యూఢిల్లీ: వారంతా జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకుని వలస వచ్చివారే. లాన్‌డౌన్ కారణంగా పూట గడవడం కష్టమైంది. ఎలాగైనా స్వస్థలాలకు చేరాలనే ఆతృతతో కొందురు కాలిబాట పడుతుంటే.. మరికొందురు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో వెళ్లడానికి స్టేషన్‌లకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి సమీపంలో యూపీకి చెందిన ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానంలో వలస కూలీలు వేల సంఖ్యలో గుమిగూడారు. అయితే అక్కడ భౌతిక దూరం మచ్చుకైనా కనిపించలేదు. కేంద్రం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్‌లో ప్రయాణించి సొంతూళ్లకు చేరాలనే ఉద్దేశంతో వలస కూలీలందరూ గ్రౌండుకు చేరారు. బీహార్ వెళ్లే ట్రైన్‌ల కోసం రైల్వే స్టేషన్‌లకు చేర్చే బస్సుల్లో ప్రయాణించేందుకు అధికారుల దగ్గర తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కౌంటర్‌లో అధికారులు వివరాలు తీసుకుంటుండగా.. ఒక్కసారిగా వలస కూలీలు గుంపులుగా పోగయ్యారు. ముందు జాగ్రత్తగా వారంతా ముఖాలకు కర్చీఫ్‌లు, వస్త్రాలు కట్టుకున్నారు. కానీ, పేర్లు నమోదు చేసుకోవాలన్న ఆరాటంలో వారి మధ్య భౌతిక దూరం కనుమరుగైంది. కరోనా జాగ్రత్తలపై ప్రశ్నించగా.. ఆ వైరస్ గురించి తనకు తెలియదు గానీ, ఇంటికెళ్లకుంటే ఆకలితో చచ్చిపోతానని ఓ వలస కూలీ అభిప్రాయపడ్డాడు. కాగా, వలస కూలీలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ట్రైన్‌లను ఏర్పాటు చేసినా.. పేపర్ వర్క్, అధిక చార్జీలు వారికి పెనుభారంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో వలస కూలీలు రోడ్లపై, ట్రాక్‌పై నడుస్తూ కనిపించకూడదని, ఎక్కడ కనిపించినా సమీపంలోని షెల్టర్‌లకు తరలించి ట్రైన్‌లలో పంపించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.