స్వస్థలాలకు పంపించాలని వలస కూలీల ఆందోళన

by Sridhar Babu |
స్వస్థలాలకు పంపించాలని వలస కూలీల ఆందోళన
X

దిశ‌, ఖ‌మ్మం: తమను స్వ‌స్థ‌లాల‌కు పంపించాల‌ని డిమాండు చేస్తూ ఖ‌మ్మం గ్రానైట్ ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేస్తున్న 80 మంది వ‌ల‌స కూలీలు శనివారం ఆందోళనకు దిగారు. క‌నీస సౌకర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని, తిండి, నీరు లేక న‌ర‌కం చూస్తున్నామ‌ని క‌న్నీరు పెట్టుకున్నారు. తమ బతుకులు దినదిన‌ గండంలా మారాయని, నెల‌ల త‌ర‌బ‌డి కుటుంబాల‌కు దూరంగా ఉంటున్నామ‌న్నారు. లాక్‌డౌన్ కారణంగా త‌మ కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము ప‌నిచేస్తున్న‌ యాజ‌మాన్యాలు కూడా మమ్మల్నిపట్టించుకోవడం లేద‌న్నారు. ఇప్పటికైనా తమకు ప్ర‌త్యేక వ‌స‌తి ఏర్పాటు చేయాల‌ని, లేకపోతే స్వ‌స్థ‌లాలకు పంపించాల‌ని వేడుకున్నారు. వీరిలో అత్య‌ధికులు బిహార్, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు ఉన్నారు. కాగా, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వలస కూలీలను స్వ‌స్థ‌లాల‌కు పంపించ‌డం కుద‌ర‌ద‌ని స్థానిక అధికారులు తెగేసి చెప్పారు.

Tags: migrant labourers, khammam granite factory, 80 members, request to state and central govt, help

Advertisement

Next Story

Most Viewed