దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకునే ప్రయత్నాల్లో మైక్రోమ్యాక్స్

by Harish |
దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకునే ప్రయత్నాల్లో మైక్రోమ్యాక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత దేశీయ మొబైల్‌ఫోన్ మార్కెట్‌(Domestic mobile phone market)లో చైనా కంపెనీలదే ఆధిపత్యం. దేశంలో విక్రయిస్తున్న చైనా బ్రాండ్ల ఫోన్ల(Phones of China brands)లో 70 శాతానికిపైగా ఈ కంపెనీలవే ఉన్నాయి. అయితే, ఇటీవల చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్‌లో చైనాకు చెందిన ఉత్పత్తులకు డిమాండ్(Demand) తగ్గింది. ఈ క్రమంలో భారత మార్కెట్లో తయారీకి ప్రాధాన్యత పెరిగింది. అలాగే, ప్రభుత్వం కూడా భారత కంపెనీల పెట్టుబడులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహమిస్తోంది.

దీన్ని అవకాశంగా మార్చుకోవడానికి అనేక దేశీయ కంపెనీ(Domestic Companies)లు సిద్ధమవుతున్నాయి. గతంలో దేశీయంగా మొబైల్‌ఫోన్లు(Mobile phones), ఎలక్ట్రానిక్స్ విభాగం(Department of Electronics)లో మంచి ఆదరణ ఉన్న మైక్రోమ్యాక్స్(Micromax) ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. 2014లో మైక్రోమ్యాక్స్ (Micromax)సంస్థ దేశీయ మొబైల్ మార్కెట్లో రెండో స్థానంలో ఉంది. అయితే, తర్వాతి పరిణామాల్లో చైనా ఫోన్ల ప్రవేశంతో ఆధిపత్యం కోల్పోయింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలను ఉపయోగించుకుని మళ్లీ పుంజుకోవాలని మైక్రోమ్యాక్స్(Micromax) సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి కోసం దేశంలో తయారీని మరింత బలంగా మార్చుకోవడానికి రూ. 500 కోట్ల వరకు పెట్టుబడులు(Investments) పెట్టనున్నట్టు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు(Co-founder) రాహు శర్మ తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం(Product-integration incentive scheme)తో భారత్‌లో తయారీ కంపెనీలకు ప్రయోజనాలున్నాయని, దీనివల్ల 6 శాతం రాయితీ(Discounted) లభిస్తుందని రాహుల్ శర్మ వెల్లడించారు. అదేవిధంగా చైనా కంపెనీలతో పోటీ పడుతూనే, అంతర్గత వనరులతో ప్రణాళికలు అమలు పరిచేందుకు సమాయత్తం అవుతున్నామని, నిధుల సమీకరణకు కూడా సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ వివరించారు. రానున్న మరికొద్ది రోజుల్లో మైక్రోమ్యాక్స్(Micromax) కంపెనీ భారత మొబైల్‌ఫోన్ మార్కెట్లో మునుపటి స్థానాన్ని భర్తీ చేస్తుందని, వినియోగదారులు ఇప్పటికీ తమ బ్రాండ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాహుల్ శర్మ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed