- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిల్ అవుతూ.. ట్రావెల్ చేయడమే జాబ్!
దిశ, వెబ్‌డెస్క్ : కంప్యూటర్ ముందు కూర్చొని.. నైన్ టూ సిక్స్ జాబ్ చేయడం చాలా మందికి నచ్చదు. కానీ ఇంట్లో పరిస్థితులు, ఆర్థిక కష్టాల వల్ల తప్పక జాబ్ చేస్తుంటారు. అయితే, జాబ్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా తాగడానికి చిల్డ్ బీర్ ఇచ్చి, తిరగడానికి ఓ కారు కూడా ఇస్తే.. ఎలా ఉంటుంది? అలాంటి ఆఫర్ వస్తే.. ప్రజెంట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి, అందులో జాయిన్ అయిపోవాలని అనుకుంటారు కదా! అమెరికాకు చెందిన బీర్ తయారీ సంస్థ ‘మైకెలాబ్ అల్ట్రా’ కూడా అచ్చం అలాంటి జాబ్ ఆఫర్‌తోనే ముందుకొచ్చింది.
మైకెలాబ్ అల్ట్రా ఆఫర్ చేస్తున్న ఉద్యోగం ‘చీఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫీసర్’. ఇందులో భాగంగా ఉద్యోగానికి ఎంపికైన ఎంప్లాయ్.. యూఎస్ వ్యాప్తంగా ఉన్న నేషనల్ పార్కుల్లో పర్యటించాల్సి ఉంటుంది. అందుకోసం కంపెనీనే కాంపర్ వ్యాన్ ఇస్తుంది. అందులో బాత్రూమ్, షవర్‌తో పాటు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఎప్పుడూ ఫ్రిడ్జ్ నిండా బీర్లు స్టాక్ ఉంటాయి. వాటిని తాగుతూ, పార్కుల్లో తిరుగుతూ.. అందమైన ఫొటోలు తీయడమే వారి పని. అయితే, సోషల్ మీడియాను ఎంగేజ్ చేసేలా.. ప్రకృతిని ఆస్వాదించే మనోహరమైన ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కడే తిరిగడం వల్ల కిక్ రాదనుకుంటే.. వెంట ఓ స్నేహితుడు లేదా వైఫ్, పెట్ డాగ్ ఇలా ఎవరో ఒకరిని తీసుకెళొచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉత్సాహం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగానికి శాలరీ ఎంతో తెలుసా.. నెలకు అక్షరాల 36 లక్షల రూపాయలు (50వేల డాలర్లు).