సన్నీ లియోన్ కావాలా…? అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..!

by Shyam |
Sunny Leone, Mia Khalifa,
X

దిశ, సినిమా : ‘ఇండియాలో మాత్రమే ఇలాంటివి చూడగలం’ అంటూ కొన్ని ఫన్నీ మూమెంట్స్, మీమ్స్ సోషల్ మీడియాలో చూస్తుంటాం. అలాంటి లిస్ట్‌లో చేరిన ఒక సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రెస్టారెంట్‌లో కనిపించింది. భారత్‌లో ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు. వీరి అటెన్షన్‌ను క్యాచ్ చేసేందుకు ఒక్కో రెస్టారెంట్ ఒక్కో ఐడియాతో ముందుకు వస్తుంటుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ‘వీర్ జీ మలాయి చాప్ వేల్’ అనే రెస్టారెంట్ తమ మెనూను ఇన్నోవేటివ్‌గా రెడీ చేసింది. ఎక్స్ పోర్న్ స్టార్స్ సన్నీ లియోన్, మియా ఖలీఫా పేరు మీద డిషెస్ అందుబాటులో ఉంచారు. సన్నీ లియోన్ చాప్, మియా ఖలీఫా చాప్‌తో పాటు 2014లో వచ్చిన సన్నీ ‘రాగిణి’ సినిమాలో బేబీ డాల్ పాటను చూజ్ చేసుకుని దాన్ని కూడా లిస్ట్‌లో యాడ్ చేశారు.

పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఈ పిక్చర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ విధంగా కస్టమర్స్ అటెన్షన్ క్యాచ్ చేసిన రెస్టారెంట్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఫుడ్ ఐటెమ్స్‌కు మహిళల పేర్లు పెట్టడం సరికాదంటూ వ్యతిరేకించారు.

Advertisement

Next Story