- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఐ స్టిక్‌తో సాధారణ టీవీ.. ఇకపై స్మార్ట్ టీవీ
దిశ, వెబ్‌డెస్క్ :
ఈ ఏడాది ‘గ్లోబల్ ఎకో సిస్టమ్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్’ జరిగినప్పటి నుంచి షియోమీ ‘ఎంఐ టీవీ స్టిక్’ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని.. టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా, ఎట్టకేలకు షియోమి కంపెనీ ఆ స్టిక్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్ ఫైర్ స్టిక్ మాదిరిగానే దీన్ని టీవీ హెచ్‌డీఎంఐ పోర్ట్‌కు అనుసంధానించి వీడియోలను స్ట్రీమింగ్ చేయవచ్చు. సాధారణ టీవీల్లోనూ ఫుల్ హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ చేసేలా దీన్ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో సినిమాలతో పాటు వివిధ షోలను కూడా చూసే అవకాశం ఉంటుంది.
ఎంఐ టీవీ స్టిక్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. వీటికోసం రిమోట్‌లో ప్రత్యేక బటన్స్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఫీచర్లు ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. సెపరేట్ బ్లూటూత్ రిమోట్ కంట్రోల్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. డాల్బీ ఆడియో, డీటీఎస్ సౌండ్ ఫార్మాట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.39.99 (రూ. 3,400/-) యూరోలుగా ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో మాత్రం షియోమీ కంపెనీ ప్రకటించలేదు. అలాగే, ఇండియాలో దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో కూడా వెల్లడించలేదు. గూగుల్ అసిస్టెంట్ బటన్స్ కూడా రిమోట్‌లో ఇవ్వడంతో.. వాయిస్ కమాండ్స్‌తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది.