పోలార్డ్ తండ్రి మృతి.. సచిన్ సంతాపం

by Shiva |   ( Updated:2021-03-24 11:19:26.0  )
పోలార్డ్ తండ్రి మృతి.. సచిన్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్డిండీస్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పోలార్డ్ తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పోలార్డ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఐపీఎల్ ట్రోఫీతో ముంబై ఇండియన్స్ జెర్సీతో తన తండ్రితో ఉన్న ఫొటోను పోలార్డ్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా భావేద్వేగానికి గురయ్యాడు.

‘టాల్ బాయ్ ఇక లేరు. మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉన్న ప్రశాంతంగా ఉంటారని నాకు తెలుసు. ఇక ముందు కూడా మీరు గర్వపడేలా చేస్తా. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ పోలార్డ్ ఎమోషనల్ అయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. పోలార్డ్ తండ్రి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. ‘మీ నాన్న గారు మరణించారనే విషయం ఇప్పుడే తెలిసింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి’ అని సచిన్ ట్వీట్ చేశాడు.

కాగా, ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున పోలార్డ్ ఆడుతున్నాడు. ఎన్నో మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. రోహిత్ శర్మ లేని సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కూడా పలుమార్లు పోలార్డ్ వ్యవహరించాడు.

Advertisement

Next Story

Most Viewed