- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంజీ మోటార్స్ నుంచి సరికొత్త హెక్టార్ ప్లస్-2021 విడుదల!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎంజీ హెక్టార్స్ ఫేస్‌లిఫ్ట్, హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 12.89 లక్షలు(ఎక్స్‌షోరూమ్), హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీ ధర రూ. 13.34 లక్షలతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎస్‌యూవీలు ఇదివరకటి కంటే మెరుగైన ఫీచర్స్, డిజైన్‌తో వస్తుందని, ఇటీరియర్స్ కూడా అప్‌గ్రేడ్‌తో లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా గురువారం నుంచే కంపెనీ డీలర్‌షిప్, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ మోడల్ నాలుగు వేరియంట్లలో లభిస్తుందని, ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 18.32 లక్షలుగా నిర్ణయించినట్టు పేర్కొంది. ఇక, 7-సీటర్ హెక్టార్ ప్లస్ మూడు సిటింగ్ ఆప్షన్లలో లభిస్తుందని, కొనుగోలుదారులు ఐదు, ఆరు, ఏడు సీట్ల వెర్షన్లను ఎంచుకోవచ్చని కంపెనీలు తెలిపింది. త్వరలో మార్కేట్లోకి రాబోతున్న టాటా సఫారి మోడల్‌కు హెక్టార్ ప్లస్ 7-సీటర్ పోటీగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హెక్టార్ ప్లస్ 7-సీటర్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 18.33 లక్షల మధ్య లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.