- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ బస్సు డిపో-1లో కంచె చేను మేసింది..
దిశ, కరీంనగర్ సిటీ : అసలే కుంటుతూ నడుస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంటి దొంగలు రాజ్యమేలుతున్నారు. అవకాశమున్నపుడే అందిన కాడికి దండుకోవాలనే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ, నిత్యం విలువైన వస్తువులు తస్కరిస్తున్నారు. స్క్రాబ్‌తో పాటు విలువైన వస్తువులను బయటకు తరలించి, విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగలు లేకుంటే దొరలుగా చలామణి అవుతూ.. వారికి జీవనోపాధి కల్పిస్తున్న సొంత సంస్థకే కన్నం వేస్తున్నారు. కరీంనగర్‌లోని ఒకటో డిపోలో ఇదే తరహాలో చోరీ చేస్తూ, అడ్డంగా దొరికిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ఒకటో డిపోలో విధులు నిర్వహిస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బస్సులకు సంబంధించిన ముఖ్యమైన విడిభాగాలతో పాటు ఐరన్, అల్యూమినియం స్క్రాబ్ కూడా చెత్తతో పాటు డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా, సెక్యురిటీ సిబ్బంది తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగి ఘన కార్యాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా, సోమవారం జరిగిన ఈ ఘటనపై ఒకటో డిపో డీఎం ఫిర్యాదు చేసినట్లు వినికిడి. కాగా, అధికారులు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ప్రశ్నిస్తే, డిపోలోని ఓ ద్వితీయ శ్రేణి అధికారి ప్రోద్భలంతోనే చేస్తున్నట్లుగా అంగీకరించినట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ చోరీపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ డీవీఎం స్థాయి అధికారితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వాడి వదిలేసిన నట్లు, బోల్టులతో పాటు, అల్యూమినియం స్క్రాబ్, ఫ్రేమ్స్ సెక్యూరిటీ తనిఖీల్లో లభించినట్లు వెల్లడించారు. విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు.