ఇండియన్ ఉమెన్ సేఫ్టీ కోసం మెటా కొత్త ప్లాట్‌ఫామ్

by Shyam |
ఇండియన్ ఉమెన్ సేఫ్టీ కోసం మెటా కొత్త ప్లాట్‌ఫామ్
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలోని మహిళలకు రక్షణ కల్పించేందుకు మెటా మూడు కార్యక్రమాలను ప్రకటించింది. ఏకాభిప్రాయం లేని సన్నిహిత చిత్రాల (NCII)ను షేర్ చేసేముందు చెక్ చేసేందుకు, లేదా పరిమితం చేయడానికి మహిళల భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది హిందీతో పాటు 11 ఇతర భారతీయ భాషలకు స్థానం కల్పించింది. మెటా తన గ్లోబల్ ఉమెన్స్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ అడ్వైజర్స్‌లో భారతీయ సభ్యులను కూడా నియమించింది.

UK రివెంజ్ పోర్న్ హెల్ప్‌లైన్‌తో భాగస్వామ్యంతో ‘StopNCII.org’( non-consensual intimate images) అని పిలిచే న్యూ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. భారతదేశంలో ఇది సోషల్ మీడియా మేటర్స్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, రెడ్ డాట్ ఫౌండేషన్ వంటి సంస్థలతో కొలాబరేషన్ కలిగి ఉంది. బాధిత మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌కు కంప్లయింట్ ఇవ్వగానే, అలాంటి ఇంటిమేట్ చిత్రాలను తీసివేస్తుంది. ఇందుకోసం Facebook, Linkedin, Bumble, Discord వంటి భాగస్వామ్య సంస్థలతో ఇది కలిసి పని చేస్తుంది. మహిళలు వారి కేసులను ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంది.

ఒక వ్యక్తికి సంబంధించిన సన్నిహిత చిత్రం(లు)/వీడియో(లు)కు ప్రత్యేక హ్యాష్‌ను రూపొందిస్తారు. దీంతో ఆ చిత్రానికి సంబంధించిన డూప్లికేట్ కాపీలకు కూడా అదే హ్యాష్ విలువ కలిగి ఉంటాయి. ఆ తర్వాత StopNCII.org తమ భాగస్వామ్య కంపెనీలతో కంప్లైంట్ ఫొటోకు సంబంధించిన సదరు హ్యాష్‌ను షేర్ చేస్తుంది. ఈమేరకు ఆన్‌లైన్‌లో అప్పటివరకు షేర్ చేసిన చిత్రాలను గుర్తించి, తీసివేయడంలో సాయపడతారు.

ఉమెన్స్ సేఫ్టీ క్లబ్ వీడియో-ఆన్-డిమాండ్ భద్రతా శిక్షణను కూడా కలిగి ఉంది. ప్రత్యక్ష భద్రతా శిక్షణ కోసం నమోదు చేసుకునేందుకు ఇది యూజర్స్‌ను అనుమతిస్తుంది. హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మెటా తన గ్లోబల్ ఉమెన్స్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ అడ్వైజర్స్‌లో మొదటి భారతీయ సభ్యులుగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్న బిషాఖా దత్తా, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్‌లో మీడియా & కమ్యూనికేషన్స్ హెడ్ జ్యోతి వదేహ్రాను నియమించింది. ఈ బృందంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి నాన్ ప్రాఫిట్ లీడర్స్, కార్యకర్తలు, విద్యా నిపుణులున్నారు.

సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవం అందించేందుకు మెటాకు ప్రాధాన్యతనిస్తుంది. మా ప్లాట్‌ఫామ్‌లో మహిళలు, పిల్లలు ఎలాంటి సవాళ్లు లేకుండా నేర్చుకునేందుకు, ఎదిగేందుకు వీలు కల్పించే సామాజిక అనుభవాన్ని ఆస్వాదించగలరని మేము విశ్వసిస్తున్నాం. అయితే భారతదేశంలో 67 శాతం మంది పురుషులు సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటే, కేవలం 33 శాతం మంది మహిళలు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యత లేకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల మహిళలకు ఇంటర్నెట్ యాక్సెస్ దూరమవుతుంది. అందువల్ల తీవ్రమవుతున్న లింగ విభజనను తగ్గించే మార్గాలను ప్రయత్నిస్తున్నాం.

కరుణా నైన్, మెటా గ్లోబల్ సేఫ్టీ పాలసీ డైరెక్టర్
Advertisement

Next Story

Most Viewed