రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ దుకాణాలు.. మున్సిపల్ రోడ్డు మిగిలేనా?

by Sridhar Babu |
రాత్రికి రాత్రే  వెలుస్తున్న అక్రమ దుకాణాలు.. మున్సిపల్ రోడ్డు మిగిలేనా?
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణములో రాత్రికి రాత్రే అక్రమ దుకాణాలు వెలుస్తున్నాయి. పట్టణములో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించిన ముఖ్యంగా మున్సిపల్‌కు సంబంధించిన రోడ్లకిరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అక్రమంగా టేలాలు, పందిళ్లు వేసి యథేచ్ఛగా దుకాణాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల బస్టాండ్ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా అక్రమ దుకాణాలు వెలిసినప్పటికీ అధికారుల దృష్టికి రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు

ఇది ఇలా ఉంటే అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణ యజమానుల నుంచి కొంత మంది దళారులు (మున్సిపల్ కు ఎలాంటి సంబంధం లేని) వ్యక్తులు ప్రతి నెల 2వేల నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

అధికారుల అవగహన లోపం

మరోవైపు పట్టణములో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా అట్టి ఆక్రమణలు తమ పరిధిలో ఉన్నాయో లేదో తెలియదు అని చెప్పడం వారికి ఉన్న అవగహన లోపాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

జగిత్యాల బస్ స్టాండ్ ఏరియా ఖాళీ ప్రదేశాల్లో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసిన వారిపై, వారి వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రయివేటు వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story