- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ కథనానికి ఎంఈవో స్పందన.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు
దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ విధుల పట్ల అలసత్వం వహించడమే కాకుండా, సమయ పాలన పాటించడం లేదు. దీంతో ‘మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి.. సమయ పాలన పాటించని టీచర్లు మాకొద్దు’ అనే శీర్షికతో మంగళవారం ‘దిశ’ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనానికి అధికారుల నుంచి స్పందన లభించింది.
బుధవారం మండల ఎంఈఓ పూల్‌చంద్, కొత్తపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర చారి కాచనపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుపై చుట్టుపక్కల వారిని, విద్యార్దులను అడిగి సమాచారం సేకరించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు బాలాజీ, సమ్మయ్య, దుర్గయ్యలతో మాట్లాడారు. పాఠశాల విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే మాకు సమాచారం అందించాలన్నారు. మంగళవారం పాఠశాలకు హజరు కానీ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు.