కరోనా టైమ్ లో .. దీపికా పదుకొనే ‘వెల్‌నెస్ గైడ్ ’ టిప్స్

by vinod kumar |
కరోనా టైమ్ లో .. దీపికా పదుకొనే ‘వెల్‌నెస్ గైడ్ ’ టిప్స్
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా టైమ్ ను సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉపయోగించుకున్నారు. కొందరేమో చాలెంజ్ లు విసిరారు. మరికొందరేమో గరిటె తిప్పారు, ఇంకొందరేమో జిమ్ వర్కవుట్స్, యోగా, మెడిటేషన్స్ ఇలా రకరకాల పనులు చేశారు. ఆఫ్ కోర్స్ చాలామంది వలంటీర్లు గా పనిచేశారు, పేదలకు ఫుడ్ అందించారు. వలస కూలీలకు ఆశ్రయం కల్పించారు. విరాళాలు అందించారు. ఇలా మంచి పనుల్లోనూ ముందుండి నటీనటులంతా రియల్ హీరోస్ అనిపించుకున్నారు. అయితే కరోనా టైమ్‌లో మెంటల్ హెల్త్ ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. దీపికా పదుకొనే కూడా ఒకప్పుడు మానసిక సమస్యలతో బాధపడేది. దాన్నుంచి బయటపడి ఎంతోమందికి స్పూర్తి గా నిలుస్తోంది. తన ఫౌండేషన్( ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్) ద్వారా మానసికంగా బాధపడేవారికి ట్రీట్ మెంట్ కూడా చేయిస్తోంది. అయితే కరోనా టైమ్ నుంచి మెంటల్ హెల్త్ కోసం దీపికా పదుకొనే కొన్ని టిప్స్ ఫాలో అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ వెల్ నెస్ గైడ్ టిప్స్ ను పంచుకుంది.

ప్రాక్టీసింగ్ సెల్ఫ్ కేర్

కరోనా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతరులకు సాయం చేయడం చాలా ముఖ్యం. అలానే ఈ టైమ్ లో మన ఆరోగ్యం గురించి కూడా ‘కేర్’ తీసుకోవడం ఇంపార్టెంట్. ‘సెల్ఫ్ లవ్ ’ ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఇతరులకు కూడా ప్రేమించగలం. మన కోసం మనం కూడా టైమ్ కేటాయించుకోవాలి. సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకోవాలి.

డైలీ రొటీన్ ఇన్ వన్ ప్లేస్ :

కరోనా టైమ్ లో జీవితం అంత సాఫీగా సాగదు. మన పనులకు ఓ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైమ్ ప్రకారం ఆయా పనులు చేసుకుంటూ పోవాలి. ఇలా ఆర్గనైజ్డ్ గా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి దరి చేరవని అంటోంది.

డూ వాట్ యూ లవ్ :

మీకు ఏదీ నచ్చితే ఆ పని చేయండి. ఇదేం ప్రొడక్టవిటీ కాంటెస్ట్ కాదు. కానీ మనకున్న టైమ్ ను ది బెస్ట్ గా యూజ్ చేసుకోవాలి. చిన్న చిన్న పనులే అమితానందాన్ని తీసుకొస్తాయి. ‘నేను చూడండి. వార్డ్ రోబ్ క్లీన్ గా చేసి.. సర్దుకున్నాను. వంటింట్లోని దినుసులకు లేబెల్స్ తయారు చేసి అతికించాను. ఈ పనులు నాకు సంతోషాన్నిస్తాయి. వాట్ వర్స్క్ ఫర్ యూ’ అంటూ దీపిక ప్రశ్నిస్తుంది. సో మనసుకు నచ్చిన పనిచేసుకుంటే.. ఆనందం మన వెంటే అని బాలీవుడ్ పద్మావతి సెలవిస్తోంది.

హాన్ ఏ స్కిల్ :

‘నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇది నా మెంటల్ హెల్త్ ను సరి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టైమ్ లో కూడా నేను కుకింగ్ కు టైమ్ ఇస్తున్నాను. మీకు కూడా మైండ్ రిలాక్స్ కావడానికి హాబీస్ ఉంటాయి. వాటిని ట్రై చేయండి’ అని దీపిక సలహా ఇస్తోంది.

బి ఏ ఫిజికల్ యాక్టివ్ :

యోగా, ఎక్సర్సైజ్ , మెడిటేషన్ ఏదైనా సరే.. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మనలోని ఆందోళన, ఒత్తిడి పోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.

బ్లూమ్ :

ఆకాశాన్ని చూడటం, పక్షుల కిలకిల రావాలు వినడం, పూలను చూడటం ఇలా ప్రకృతిని ఆస్వాదించడం ఎంతో మంచి అనుభూతి. ప్రకృతిలో జీవిస్తే.. శరీరంలో కొత్త శక్తి వస్తుంది. ఇప్పటినుంచైనా ప్రకృతిని ఆస్వాదించండి.

టైమ్ టూ కనెక్ట్ :

ఈ టైమ్ లో బయటకు వెళ్లే అవకాశం లేదు. సో.. మనకు నచ్చిన వారితో ఫోన్ లో టచ్ లో ఉండండి. వీడియో కాల్స్ చేయండి. పాత జ్ఞాపకాలను షేర్ చేసుకోండి. ఇవి మిమ్మల్ని తప్పకుండా సంతోష పెడతాయి,

మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోకండి.. మీకు మీరే సాటి. మీలాంటి వాళ్లు ఇంకా ఎవరు లేరు.

Advertisement

Next Story