- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిపై పురుషులదే రాజ్యం.. ప్రమాదంలో మహిళా జనాభా?
దిశ, ఫీచర్స్ : ప్రపంచదేశాలు ఎంతగా అభివృద్ధి చెందినా జెండర్ డిస్క్రిమినేషన్ మాత్రం సమసిపోవడం లేదు. పుట్టబోయేది ఆడబిడ్డని తెలిసి అబార్షన్లు చేసుకునేవారి సంఖ్య తగ్గడం లేదు. ఈ పరిస్థితిని అడ్డుకోవడంలో ఆయా దేశాల ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాగా ఇలాంటి చర్యల వల్ల జెండర్ ఇంబ్యాలన్స్(లింగ అసమతుల్యత) ఏర్పడి భూమ్మీద మహిళల కంటే పురుషుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి 2017 మధ్య 45 మిలియన్ సంఖ్యలో ఆడశిశువుల అబార్షన్లు జరిగినట్టు ‘బీఎంజే గ్లోబల్ హెల్త్’ రీసెర్చ్ స్పష్టం చేసింది. 1970 నుంచి పరిశీలిస్తే ఆగ్నేయ ఐరోపా, ఆసియాలో ఎక్కువ మంది అబ్బాయిలే జన్మించారని తెలిపింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒకవంతుకు పైగా జనాభా సెక్స్-సెలెక్షన్‌కు మొగ్గుచూపితే ‘లాంగ్ టర్మ్ సెక్స్ ఇంబ్యాలన్సెస్’కు దారితీస్తుందని.. ఇది చాలా దేశాలపై సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఈ మేరకు 2100 నాటికి దాదాపు 5.7 మిలియన్ ఆడశిశువుల మరణాలు సంభవించవచ్చని, ఒకవేళ అన్ని దేశాలు ‘సెక్స్ రేషియో ఎట్ బర్త్(SRB)’ ముప్పును ఎదుర్కొన్నట్టయితే.. ఆ సంఖ్య 22.1 మిలియన్లకు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. భవిష్యత్‌లో ప్రి-నాటల్ సెక్స్ డిస్క్రిమినేషన్‌ను, సామాజిక నిర్మాణాలపై దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పాలసీ ప్లానింగ్ అవసరమని తేల్చింది.
వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు 810 మంది మహిళలు గర్భధారణ లేదా ప్రసవ సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఈ మేరకు 2000 సంవత్సరంలో 51 శాతంగా ఉన్న మహిళా కార్మికుల భాగస్వామ్యం 2019 వచ్చేసరికి 48 శాతానికి పడిపోయింది. అలాగే, స్త్రీలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా వేతనంలేని పనులు చేయాల్సి వచ్చింది. రోజుకు అదనంగా 1- 5 గంటలు ఇంటి పని, పిల్లల సంరక్షణతో పాటు ఇతర కుటుంబ కార్యకలాపాలకు కేటాయించారు. ఈ పరిస్థితి పాండమిక్ టైమ్‌లో మరింత పెరగొచ్చని తెలిపింది.