ఖమ్మం ఖిల్లాపై నీలి రంగు జెండా ఎగరేస్తా :మేకతోటి పుల్లయ్య

by Sridhar Babu |
ఖమ్మం ఖిల్లాపై నీలి రంగు జెండా ఎగరేస్తా :మేకతోటి పుల్లయ్య
X

దిశ, ఖమ్మం: బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా మేకతోటి పుల్లయ్యను రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. నూతన ఇన్చార్జ్ మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకముంచి బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో జిల్లాలో అందర్నీ కలుపుకొని బహుజన రాజ్యస్థాపన కోసం సంయుక్తంగా కృషి చేస్తామన్నారు.

నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని, ఖమ్మం ఖిల్లాపై నీలి రంగు జెండాను ఎగరవేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి పీసీ వీరాస్వామి , సీనియర్ నాయకులు కర్రి కృష్ణ , మట్టె గురుమూర్తి , ప్రసాదు , కార్యదర్శి మిర్యాల నాగరాజు , సుభాష్ చంద్రబోస్ , చంద్రమోహన్ , మహిళా కన్వీనర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story