- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెహ్రీన్‌కు కాబోయే భర్తపై బ్లాక్ మనీ ఆరోపణలు?
దిశ, సినిమా : ప్రెట్టీ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో అతికొద్ది మంది బంధువుల మధ్య ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది మెహ్రీన్. జైపూర్ అలీలా కోట ఇందుకు వేదిక కాగా.. సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఈ మేరకు మే లేదా జూన్‌లో వివాహ మహోత్సవం జరగనుందని తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ్, పంజాబీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్.. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పనుందని సమాచారం. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పెద్దింటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి ఇకపై బిగ్ స్క్రీన్‌పై కనిపించదన్న టాక్‌తో అభిమానులు బాధపడుతున్నారు.
ఇక మెహ్రీన్‌కు కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ విషయానికొస్తే.. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోయారు. అంతేకాదు భవ్య కుటుంబంపై బ్లాక్ మనీ ఆరోపణలతో ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ నిర్వహించారు అధికారులు. వీరి ఫ్యామిలీకి విదేశాల్లో దాదాపు రూ. 200 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని తెలుస్తుండగా.. గతంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు కేసు కూడా నమోదవడం గమనార్హం.