- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆచార్య’ షూటింగ్ షురూ
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివని నిర్ధారణ కావడంతో ఇప్పట్లో ‘ఆచార్య’ మూవీ షూటింగ్ జరిగే అవకాశాలు లేవని అందరూ భావించారు. సినిమా రిలీజ్‌పై ఈ ఎఫెక్ట్ ఉంటుందని పలువురు విశ్లేషించారు. కానీ, ఈ ఊహాగానాలన్నింటికీ బ్రేక్ వేస్తూ డైరెక్టర్ కొరటాల శివ డేర్ డెసిషన్ తీసుకున్నారు. గురువారం ‘ఆచార్య’ షూటింగ్‌ను మొదలుపెట్టారు. షూట్ లొకేషన్‌లో కొరటాల అండ్ టీం ఉన్నఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
డైరెక్టర్ శివ మెగాస్టార్ చిరంజీవితో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. చిరంజీవి, కాజల్ కాకుండా వచ్చే అన్ని ఎపిసోడ్స్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. వచ్చే నెలలో చిరంజీవి-కాజల్ షూటింగ్‌లో జాయిన్ అయే లోపు మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ పూర్తి చేయనున్నట్లు టాక్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కమ్యూనిస్ట్ సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.