మెగాస్టార్ చిరు ‘చార్’ ధమాకా.. బాబీతో మూవీ కన్ఫర్మ్

by Shyam |   ( Updated:2021-01-22 11:44:42.0  )
మెగాస్టార్ చిరు ‘చార్’ ధమాకా.. బాబీతో మూవీ కన్ఫర్మ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు వరుస రీమేక్‌లు చేస్తున్నారు. కాగా, ‘ఆచార్య’ తర్వాత..చిరును డైరెక్ట్ చేసే సినిమాల డైరెక్టర్లతో దిగిన ఫొటోను చిరు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ నలుగురు నా కెప్టెన్లు అని తెలిపారు. ఈ పిక్‌లో చిరు..మెహర్‌ రమేష్‌, మోహన్‌ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు. ఈ నలుగురితో చిరు సినిమాలు చేయబోతున్నారు కాబట్టే..కెప్టెన్లు అని ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘ఇక మందుంది బాక్సాఫీసుకు ఊచకోత’ అని కామెంట్ చేస్తున్నారు. మీ డ్యాన్స్, గ్రేసుతో థియేటర్లు మోత మోగాల్సిందేనని అంటున్నారు.

ఇప్పటికే సెట్స్‌పై ఉన్న ‘ఆచార్య’ త్వరలో పూర్తి కానుంది. దీని తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ పూజా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. ఈ రెండు చిత్రాల తర్వాత మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాలమ్‌’ రీమేక్‌కు రంగం సిద్ధం చేశారు చిరు. ఇక డైరెక్టర్‌ బాబీతో సినిమాని కన్ఫర్మ్‌ చేశారు మెగాస్టార్‌. ఈ ఇయర్‌ ఇండింగ్‌కి దాదాపు ఈ సినిమాలన్నీ కంప్లీట్‌ చేయాలని చిరు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story