భారీగా విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్

by Shyam |   ( Updated:2021-12-01 11:30:48.0  )
chiru, cherry
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వర్షాలు, వరద బీభత్సానికి నష్టపోయిన బాధితులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ ప్రభుత్వ సహయనిధికి విరాళంగా ప్రకటించారు. వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వరద బాధితులకు అండగా నిలిచారు.

బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు మెుత్తం ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం వరద బాధితులకు రూ.25 లక్షలు సాయం అందించారు.

సినిమా టికెట్లు, షోస్‌ తగ్గింపు‌పై కే రాఘవేంద్ర రావు కీలక ప్రకటన

Advertisement

Next Story