తొలి ట్వీట్‌తో 'చిరు' సందేశం

by Shyam |
తొలి ట్వీట్‌తో  చిరు సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. తొలి ట్వీట్‌తో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. రెండో ట్వీట్‌లో కరోనా ప్రభావం, పరిస్థితులు, జాగ్రత్తలపై సూచనలిచ్చారు. భారతీయులు, తెలుగు ప్రజలు, అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడగలగడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించేందుకు ఈ సంవత్సరాది రోజున కంకణం కట్టుకుందామని పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు 21 రోజులు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం అనివార్యమన్నారు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రదానమంత్రి నరేంద్ర మోడి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల ఆదేశాలను పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి పట్టునే ఉందాం… సురక్షితంగా ఉందాం అంటూ ట్విట్టర్ సందేశాన్ని ఇచ్చారు చిరు. వెల్ కమ్ బాస్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతుండగా… తోటి సినీ ప్రముఖులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మీ ట్విట్టర్ సందేశాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిస్తున్నామన్నారు.


Tags: Megastar Chiranjeevi, Chiru, Konidela Chiranjeevi, CoronaVirus, Covid19, Twitter

Advertisement

Next Story