- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూలుక్స్ వైరల్.. చిరు క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: గత మూడు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీసం కట్టు తీసేసి.. క్లీన్ షేవ్‌తో అచ్చం కుర్రాడిలా ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ఇందు కోసమే చిరంజీవి న్యూ గెటప్‌లో కనిపిస్తున్నారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్నారు.
దీంతో చిరంజీవి ఈ అంశంపై స్పందించారు. న్యూ లుక్ సరదా కోసమే తప్ప సినిమా కోసం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే శుక్రవారం నుంచి జరిగే ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలపై స్పందించారు. ఈ మేరకు చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. ప్రవాస తెలుగువారు తెలుగు భాష అభ్యున్నతికి చేస్తున్న కృషిని కొనియాడారు .
‘ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పట్ల మీకున్న అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ, గుజరాతీ తర్వాత మూడో స్థానంలో ఉంది.
ఇంతటి గొప్ప తెలుగు సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల్లోని తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి… జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం. కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు సంప్రదాయ విలువలను బావి తరాలకు అందించాలన్న మీ తపనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.’ అని చిరంజీవి అన్నారు.