టాలీవుడ్‌లో టెన్షన్.. ఆసుపత్రిలో మెగాస్టార్

by Anukaran |   ( Updated:2021-10-17 09:37:39.0  )
Chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఆసుపత్రిలో చేరారు. కుడిచేతి మణికట్టు దగ్గర నొప్పిగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలిసిన ఆయన అభిమానులే కాకుండా టాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజాగా.. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ.. కుడిచేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించానని వెల్లడించారు. మణికట్టు దగ్గరున్న నరంమీద ఒత్తిడి పడిందని తెలిపారు. దీంతో చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సైతం ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.Chiranjeevi

Advertisement

Next Story