చిరంజీవి అసంతృప్తి.. లూసిఫర్ దర్శకుడు మార్పు?

by Shyam |
చిరంజీవి అసంతృప్తి.. లూసిఫర్ దర్శకుడు మార్పు?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి అప్ కమ్మింగ్ మూవీ లూసీఫర్‌పై చర్చ నడుస్తోంది. ఇటీవల సాహు మూవీతో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యువ దర్శకుడు సుజీత్‌.. లూసీఫర్ మూవీకి డైరెక్టర్‌గా చేస్తున్నట్లు తెలిసిందే. అయితే, సుజీత్‌ను సినిమా నుంచి మెగాస్టార్ తొలగించినట్లు ఫిలీంనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్‌గా సుజీత్ పనితనం చిరుకు సంతృప్తిగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story