మెగా క్యూట్ కమెడియన్..

by Shyam |
మెగా క్యూట్ కమెడియన్..
X

మెగా మనవరాలు నవిష్క క్యూట్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన ముద్దుల మనవరాలిని ఒళ్లో కూర్చో పెట్టుకుని చేసిన అల్లరి.. ‘ఖైదీ నం.150’ సినిమాలో తన పాట అంటే నవిష్కకు ఎంత ఇష్టమో చూపించిన వీడియో నెటిజన్లను ఫిదా చేసింది. ఆ తర్వాత తాత చిరు, మామ చరణ్ పాటలకు స్టెప్స్ వేసి నెటిజన్లను మెప్పించిన నవిష్క.. తాజాగా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో మెగా ఫ్యామిలీని ఎంత హ్యాపీగా ఉంచుతుందో తెలుపుతూ వీడియో షేర్ చేసింది శ్రీజ కళ్యాణ్.

‘ఏడాది పిల్లలు మనల్ని నవ్వించేందుకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా పెంచుకుంటారో చూడండి’ అంటూ విడియో పోస్ట్ చేసింది. తన ఫన్నీ ఫేస్, సిల్లీ సౌండ్స్ ఇంట్లో అందరినీ నవ్విస్తాయని తెలిపింది. ఇలాంటి కమెడియన్ మా ఇంట్లో ఉన్నందుకు ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. స్పెషల్‌గా ఇలాంటి పరిస్థితుల్లో నవిశ్క అల్లరి అదృష్టమే అంటోంది శ్రీజ కళ్యాణ్.

https://www.instagram.com/p/CC-xaqOJa4l/

Advertisement

Next Story