మెగా బ్రదర్స్ అరుదైన ఫొటో

by Shyam |
మెగా బ్రదర్స్ అరుదైన ఫొటో
X

మెగా స్టార్ చిరంజీవి అభిమానుల ఆరాధ్యుడు. ఆయన మార్గంలోనే ఇండస్ట్రీకి వచ్చిన వారు ఆయన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్. వారు ముగ్గురి కలయిక అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంది. అయితే, వారు ముగ్గురు కలిసిన ఓ అరుదైన, అపురూపమైన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆ ఫొటో ఈ మధ్య దిగింది కాదండోయ్..బావగారూ బాగున్నారా మూవీ వంద రోజుల వేడుక సందర్భంగా తీసినది. బావగారు బాగున్నారా మూవీ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచనలో తమ్ముడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్‌లో వచ్చింది. ఈ చిత్రంలో రంభ, రచన హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాదు. మ్యూజికల్‌గా మంచి హిట్టైయింది. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ మూవీలో చిరంజీవి పెద్ద కొండపై నుంచి తాళ్లు కట్టుకొని లోయలోకి బంగీ జంప్ అనే సాహసం చేసారు. సారీ సారీ అనే పాటలో నాగబాబు గెస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, శ్రీహరిల కామెడీ హైలెట్. ఈ చిత్రం వంద రోజుల వేడుకలో మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే వేదికపై మెరిసారు. రీసెంట్‌గా ఈ సినిమా 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.

Tags: mega brothers, rare photos, bavagaru bagunnara movie, 100 days function

Advertisement

Next Story