- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకులు, పువ్వులతో సెలబ్రిటీ ఫ్యాషన్స్.. ఫోటోలు వైరల్
దిశ, ఫీచర్స్ : ‘ఆహార్యం’ విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తాము వేసుకునే క్లాత్స్, డిజైనర్ వేర్స్ చాలా స్పెషల్‌గా, యూనిక్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో ప్రత్యేకంగా తయారుచేయించుకుంటారు. ఇక ఈవెంట్స్, గేమ్ షో, అవార్డ్ ఫంక్షన్ సమయంలో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలిచేందుకు వెరైటీ కాన్సెప్ట్‌లతో తమ దుస్తులను డిజైన్ చేయిస్తారు. కానీ త్రిపురకు చెందిన ఓ విలేజ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు అందుబాటులో ఉన్న పూలు, మొక్కలు, ఆకులతో వాటిని రీక్రియేట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.
త్రిపురలోని చిన్న గ్రామంలో నివసించే 26 ఏళ్ల నీల్ రనౌత్ తన ఇన్‌స్టాలో సెలబ్రిటీలను ఫాలో అవుతుంటాడు. అయితే ఫ్యాషన్ వేర్స్, ట్రెండ్స్‌పై ఇష్టమున్న రనౌత్ ఒకానొక రోజు ఆయా సెలబ్రిటీలు వేసుకున్న వస్త్రాలను రీక్రియేట్ చేయాలనుకున్నాడు. ఆకులు, కర్రలు, రాళ్ళు, పువ్వులు వంటి అతనికి అందుబాటులో ఉన్న మెటీరియల్స్ ఉపయోగించి ఒరిజినాలిటీని మ్యాచ్ చేసేలా అత్యద్భుతంగా డిజైన్ చేస్తూ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు.
అయితే అందులోనూ ఫిమేల్ లీడ్స్ డ్రెస్‌లనే అతడు అనుకరిస్తుండటం విశేషం. అతడి పోస్ట్‌లు నెటిజన్లను ఫిదా చేస్తుండగా, ఫాలోవర్ల సంఖ్య 32వేలకు పైగా పెరిగింది. అతడు తన బయోలో తనను తాను “విలేజ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్” గా అభివర్ణించుకున్నాడు. చిన్నప్పుడు ఫ్యాషన్ కోర్సు చేయాలనుకున్న అతడు ఆర్థికపరిస్థితుల వల్ల వెనకడుగు వేశాడు. కానీ నేడు అదే ఫ్యాషన్ డిజైనింగ్ అతడ్ని ఓ మినీ సెలబ్రిటీగా లోకానికి పరిచయం చేసింది. ఇక రనౌత్ అసలు పేరు ‘సర్బాజిత్ సర్కార్’ కాగా ‘నీలం’ (నీల్) రంగుతో పాటు కంగనా రనౌత్‌పై అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నాడు.
‘నేను చేస్తున్న పనికి గర్వపడుతున్నాను. నన్ను అభిమానించే వాళ్లు ప్రస్తుతం వేలల్లో ఉన్నారు. కొంతమంది నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా నా పనిపై శ్రద్దపెడుతున్నాను. తొలిగా నాకు ఫ్యాషన్‌పై పెద్దగా అవగాహన లేదు. కానీ ఓ అవార్డ్ ఫంక్షన్‌కు దీపిక పదుకొణె వేసుకున్న డ్రెస్‌పై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ జరిగింది. ఆన్‌లైన్‌లో ఆమెపై పెద్దఎత్తున ట్రోల్ చేశారు. ఆ సయమంలో అరటి ఆకులతో ఆ దుస్తులను రూపొందించాలని నిర్ణయించుకున్నాను. నేను కొన్ని చిత్రాలను క్లిక్ చేసి, ఆపై వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసాను. దాంతో అవి వైరల్ అయ్యాయి. అలా నాకు అందుబాటులో ఉన్న వస్తువులతో దుస్తులు రీక్రియేట్ చేయడం ప్రారంభించాను. నా పనిని ప్రఖ్యాత డిజైనర్ సందీప్ ఖోస్లా కూడా అభినందించాడు. నా పనిపట్ల తొలిగా మా ఇంట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్లంతా సంతోషంగా ఉన్నారు’ అని రనౌత్ తెలిపాడు.