- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంజమిన్.. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తొలి గే యాక్టర్
దిశ, ఫీచర్స్ : ‘థర్డ్ జెండర్’ కమ్యూనిటీని సమాజం ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేదు. వారిలోని ఎంతోమంది ప్రతిభావంతులు ఆయా రంగాల్లో సత్తా చాటుతుండగా.. సినీరంగంలోనూ వీరి సంఖ్య తక్కువేం లేదు. ఈ నేపథ్యంలోనే గువాహటికి చెందిన యాక్టర్ బెంజమిన్ డైమరీ.. ఇటీవలే జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. అస్సామీ చిత్రం ‘జోనాకి పోరువా’(ఫైర్‌ఫ్లైస్)లో తను పోషించిన ట్రాన్స్‌జెండర్ జాహ్ను పాత్రకు జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్న బెంజమిన్.. ఈ క్రమంలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ గే యాక్టర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఎల్‌జీబీటీ కమ్యూనిటీ చిత్రాలకు గతంలోనూ జాతీయ అవార్డులు వచ్చాయి. పలువురు టెక్నీషియన్స్ కూడా అవార్డులు అందుకున్నారు. కానీ ఆ సంఖ్య అత్యల్పం. 2001లో స్నిప్ చిత్రానికి గాను ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్న చిత్ర రచయిత-సంపాదకుడు అపూర్వ అస్రాణి.. మొట్టమొదటి ఓపెన్ గే ఫిల్మ్ రైటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2012లో ఒనీర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ యాప్’ అనే ఆంథాలజీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. గే హక్కుల కార్యకర్త శ్రీధర్ రంగయన్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘బ్రేకింగ్ ఫ్రీ’ బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో తమన్నా (1998), నాను అవనాల్లా అవలు (2015), నాగర్‌కిర్తాన్ (2018) వంటి చిత్రాలు పలు అవార్డులు గెలుచుకోగా, ఇందులో కథానాయకుల పాత్రలను ట్రాన్స్‌జెండర్సే పోషించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నటుడిగా గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న మొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడిగా జెంజమిన్ చరిత్ర సృష్టించాడు. ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తను ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
‘దేశంలో ఎల్‌జీబీటీక్యూ సంఘాన్ని ప్రజలు చూసే విధానాన్ని ఈ అవార్డు మారుస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ముంబై, ఢిల్లీ, చంఢీగడ్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలో ఎక్కడైనా ఉండటానికి ఇష్టపడతాను. గువాహటికి ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరేశ్వర్‌లో నేను జన్మించాను. నా లైంగిక ధోరణిని అంగీకరించి, నాటక రంగంపై నాకున్న అభిరుచికి నా కుటుంబం మద్ధతునిచ్చింది. ఇలాంటి ఫ్యామిలీలో జన్మించడం అదృష్టంగా భావిస్తాను. 2014 నుండి నాటకరంగంలో ఉన్నాను. ఆ సమయంలోనే మేకప్, ఫ్యాషన్ డిజైనింగ్‌పై నాకు ఆసక్తి కలిగింది. ఇక ట్రాన్స్‌జెండర్లపై రీసెర్చ్ చేసి తీసిన ‘జోనాకి పోరువా’ చిత్రంలో నాకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నా. 2018లో పూర్తయ్యి, 2019 చివరన విడుదలైన ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు’ అని డైమరీ తెలిపాడు.