నీలా ఎవరూ నవ్వించలేరు: షాహిద్ భార్య

by Jakkula Samataha |
నీలా ఎవరూ నవ్వించలేరు: షాహిద్ భార్య
X

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మీరా కపూర్ జంట ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉంటారు. షాహిద్ వెంటే ఉంటుంది మీరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాగా వీరిద్దరి ఐదో పెళ్లి రోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది మీరా.

ఐదేండ్లు, నాలుగు ఆత్మలు, మూడు ఇండ్లు, ఇద్దరు పిల్లలు, ఒక అందమైన కుటుంబం.. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా అంటుంది మీరా. షాహిద్‌తో రోజూ ప్రేమలో పడుతున్నాను అని అంటున్న మీరా.. తన బెస్ట్ ఫ్రెండ్ తన జీవిత కాలపు ప్రేమ కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. తనకు అన్ని విషయాల్లో సపోర్ట్ ఇస్తూ.. ప్రతీ అడుగులో తోడుంటూ.. తనకు బలాన్నిచ్చిన షాహిద్‌కు థాంక్స్ చెప్పింది. ఈ లోకంలో ఎవరూ తనను షాహిద్‌లా నవ్వించలేరని.. ఆనందంగా ఉంచలేరని చెప్తున్న మీరా.. భార్య ఎప్పుడూ సరైనదే అన్న విషయం ఎప్పుడూ మరిచిపోవద్దు అని సూచించింది. చివరగా గోల్డెన్ వర్డ్స్ అంటూ.. ఐ యామ్ సారీ అని తెలిపింది. మరెన్నో ఏండ్లు ఇంతే సంతోషంగా సాగాలని కోరుకుంది మీరా.

Advertisement

Next Story

Most Viewed