- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడి చేతిలో మోసపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇంటినుంచి గెంటేశాడంటూ
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు, ప్రతి ఒక్కరిని నమ్మడం, చివరికి వారు మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక హీరోయిన్ కూడా అలాగే ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పవన్ కళ్యాణ్ హీరోగా 2006లో వచ్చిన ‘బంగారం’ సినిమాలో నటించి మెప్పించిన మీరా చోప్రా ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ఇంటీరియల్ వర్క్ కోసం రాజేందర్ అనే వ్యక్తి వద్ద మొత్తం రూ. 17 లక్షలకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే రూ. 8 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి, పని ప్రారంభించాలని తెలిపి ఆమె షూటింగ్ నిమిత్తం వెళ్లిపోయింది.
షూటింగ్ పూర్తిచేసుకొని తిరిగి వచ్చేసరికి నాణ్యత లేని మెటీరియల్ తో ఇల్లు డిజైన్ చేసినట్లు తెలుసుకొని రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అతను ఏమి పట్టనట్లు ప్రవర్తించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర రూ. 8 లక్షలు తీసుకొని నాణ్యత లేని మెటీరియల్ తో ఇంటిని డిజైన్ చేసాడని, ఏంటి ఇది అని గట్టిగా మాట్లాడితే తన ఇంటి నుంచి తననే గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మీరా చోప్రా ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.