‘అమ్మాయిలు అతిగా ఫోన్ వాడటం వలనే అత్యాచారాలు పెరుగుతున్నాయి’

by Shamantha N |
‘అమ్మాయిలు అతిగా ఫోన్ వాడటం వలనే అత్యాచారాలు పెరుగుతున్నాయి’
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడటం వలనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనాకుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలీఘడ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎక్కువగా ఫోన్లు ఉపయోగించడం సరికాదని, అమ్మాయిలు అతిగా ఫోన్లును ఉపయోగించడం వలనే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అమ్మాయిలు ఫోన్లు వాడకూడదన్నారు. వారు ఎక్కువగా ఫోన్లు వాడుతూ గంటలకొద్దీ అబ్బాయిలతో బాతాఖానీలు కొడుతున్నారని మండిపడ్డారు. అమ్మాయిలకు ఫోన్ ఇవ్వడం వలన అబ్బాయిలతో స్నేహం చేసి అనంతరం వారితో పారిపోతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి విషయాలు తెలియడం లేదని అసలు అమ్మాయిలకు పోన్లు ఇవ్వకూడదని పేర్కొన్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందన్నారు.

Advertisement

Next Story