- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విదేశాల్లాంటి పరిస్థితి మనకొద్దు : మీనా
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సినీ ప్రముఖులు ఇప్పటికే తమ సందేశాల ద్వారా తెలిపారు. తాజాగా, సినీ నటి మీనా స్పందించింది. ఈ మహమ్మారి కట్టడి కోసం, మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం బాధగా ఉందని పేర్కొంది. విదేశాల్లోని పరిస్థితి భారత్ కు రావొద్దంటే ప్రజలంతా ప్రభుత్వాలు చెప్పిన మాటలు వినాలని ఆమె కోరారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంటో ప్రభుత్వాలు చెప్పిన మాటలు కొందరు వినడం లేదంటూ తన బాధను వ్యక్తం చేసింది నటి మీనా. విదేశాల్లో ఉన్న పరిస్థితి మనకు రావద్దంటూ హితవు పలికారు. ‘ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా?, ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే అమెరికా దేశంలో అయితే రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ తో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు రావొద్దు. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించండి’అని అన్నారు. ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అవకాశం అందరికీ దొరకదని, కుటుంబ సభ్యులతో సంతో షంగా గడపండని సూచించింది.
Tags: meena, south cinema, heroine, tollywood, kollywood, corona, precautions