- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. మంత్రి మల్లారెడ్డిపై తిరగబడ్డ రైతులు ఏం చేశారంటే..
దిశ, మేడిపల్లి : మేడిపల్లిలో హరితహారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మొక్కలు నాటడానికి వచ్చిన మంత్రిపై రైతులు ఆగ్రహంతో తిరగబడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వివరాల ప్రకారం.. గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు 116 ఎకరాల భూమిని.. 38 మంది రైతుల దగ్గర నుంచి భూ సేకరించారు. ఈ క్రమంలో 56 ఎకరాలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కోసం కేటాయించారు.
మిగిలిన 60 ఎకరాలను డెవలప్ చేసి ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తామని.. సేకరణ సమయంలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, రాచకొండ కమిషనరేట్ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ హామీ అమలు కాలేదని రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధిత రైతులు పంగ నర్సింహ్మా, ఉమాశంకర్‌లు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట దళితుల భూమిని లాక్కొన్ని తమను రోడ్డున పడేశారని అన్నారు. సర్వే నెంబర్ 62లో గల భూమిలో ఉన్న భూమిని ప్రభుత్వం తమ వద్ద తీసుకుని రైతులకు అన్యాయం చేసిందిని ఆరోపించారు. ఉప్పల్ బాగాయత్ మాదిరిగా ఎకరాకు 1000 గజాల చొప్పున ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీనిపై 2018లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై నిర్ణయం కూడా తీసుకుందన్నారు.
తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూమిని ఇప్పించాలని నాలుగు సార్లు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను కలిసి విన్నవించామని, అదేవిధంగా చాలాసార్లు జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. కానీ ఇంత వరకు తమకు న్యాయం జరగకపోగా, ఖాళీగా ఉన్న ఆ 60 ఎకరాలు కబ్జాకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దళిత సాధికారత కోసం నిధులు కేటాయిస్తాం.. వారి జీవితాలను బాగు పరుస్తామని చెబుతున్నప్పటికీ, తమకు మాత్రం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు.
మంత్రి కేటీఆర్‌కు పలుమార్లు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి మాల్లారెడ్డికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.