ఉసురు తీసిన అప్పులు

by Shyam |
ఉసురు తీసిన అప్పులు
X

దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మెడికల్ షాపు యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస మెడికల్ షాపు యజమాని ఎల్లం ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story