- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం
దిశ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ఉంటూ.. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా నిలిచింది. మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో బుధవారం బాధిత కుటుంబాలకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెక్కులు అందజేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 65 మంది కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, 40 మంది సాధారణ మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు. ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన 8 మంది వర్కింగ్ జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.ఒక కోటి 74 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమ నిధికి మొత్తం రూ.42 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 353 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, 116 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. అంతేగాక కరోనా వైరస్ బారిన పడిన 3,915 మంది జర్నలిస్టులకు తక్షణ సాయంగా మొదటి విడుత కొవిడ్ బాధితులకు రూ.20 వేలు, రెండో విడుతలో కొవిడ్ బాధితులకు రూ.10 వేల చొప్పును రూ. 5.70 కోట్లు అందించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆర్థిక సహాయం పొందిన కుటుంబాలకు నెలకు రూ.3వేల పెన్షన్ తో పాటు, ఆయా కుటుంబాల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లిస్తామని తెలిపారు. అనంతరం ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ జర్నలిస్టులకు ప్రత్యేక నిధి కల్పించి రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే 500 మందికి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు.
శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ.. జర్నలిస్టుల సహకారంతోనే తనకు ఈ స్థానం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్జగన్, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, మేనేజర్ వనజ, టీయూడబ్ల్యూజే కోశాధికారి మారుతి సాగర్, ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే నాయకులు యోగానంద్, నవీన్, ఆదినారాయణ, విష్ణు, భాస్కర్, టీపీ జేఏ అధ్యక్షుడు భాస్కర్, వీడియో గ్రాఫర్ల సంఘం నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.