- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : మంత్రి మల్లారెడ్డికి భారీ షాకిచ్చిన సొంత నేత
దిశ ప్రతినిధి, మేడ్చల్ : గులాబీ పార్టీలో చిచ్చు రేగుతోంది. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు ఆ పార్టీలో దూమారం రేపాయి. కమిటీలు వేసేటప్పుడు కనీస సమాచారం ఇవ్వడంలేదని, కమిటీలు వేసేటప్పుడు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్ మలిపెద్ద శరత్ చంద్రా రెడ్డి పేరిట ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఆయన రాజీనామా చేసింది పార్టీకా..? లేదా జడ్పీ ఛైర్మన్ పదవికా? అనేది స్పష్టం చేయలేదు.
కాగా, ఇప్పటికే మేడ్చల్‌లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్యన గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. సుధీర్ రెడ్డికి దక్కాల్సిన ఎమ్మెల్యే టిక్కెట్‌ను మల్లారెడ్డి అడ్డుపడి దక్కించుకున్నాడని ఆయన వర్గం గుర్రుగా ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, సుధీర్ రెడ్డి కుమారుడు శరత్ చంద్రా రెడ్డికి జెడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయినా మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి గ్రూపులు రెండుగా విడిపోయి ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మేడ్చల్లో నూతన టీఆర్ఎస్ కమిటీలు వేస్తున్నారు. అయితే, జడ్పీ ఛైర్మన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, ఆయన్ను కనీసం పిలువకుండా కమటీలు వేయడంపై శరత్ చంద్రా రెడ్డి తన సన్నిహితుల వద్ద బాధను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపంతో రాజీనామా చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కాగా, దీనిపై మరింత స్పష్టత రావాల్సిఉంది.