- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ జోయల్ డేవిస్
దిశ, మెదక్ :లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్లపై ఉమ్మి వేస్తే ఆ వ్యక్తులను డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుకొని జరిమానా విధిస్తామని సిద్దిపేట సీపీ జోయల్ దేవిస్ హెచ్చరించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు, కర్చీఫ్, రుమాలు తప్పకుండా కట్టుకొని రావాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. కరోనాను అరికట్టడంలో భాగంగా సిద్దిపేట జిల్లా సరిహద్దులో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 పికెట్లు, 880 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 190 మంది పాస్పోర్టులు సీజ్ చేశామని నిబంధనలను ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన 81 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Tags : roads, Spitting, lackdown, cp joyal devis, siddipet, vehicils