- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళపై ముంబయి సిటీ విజయం
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సితో జరిగిన మ్యాచ్‌లో ముంబయి సిటీ 2-1 తేడాతో విజయం సాధించింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబయి సిటీ టాస్ గెలిచి ఎడమ నుంచి కుడికి ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. పాయింట్ల టేబుల్‌లో 9వ స్థానంలో ఉన్న కేరళ బ్లాస్టర్స్ దూకుడుగా ఆట ప్రారంభించింది. సరైన పాస్‌లు ఇచ్చుకుంటూ ముంబయి డిఫెన్స్‌ను పలు మార్లు ఛేదించింది. ఈ క్రమంలో 27వ నిమిషంలో విసెంటీ గోమెజ్ కేరళ బ్లాస్టర్స్‌కు గోల్ అందించాడు. దీంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లింది. తొలి అర్దభాగం ముగిసే వరకు ఇరు జట్లు మరో గోల్ చేయలేదు.
ఇక రెండో అర్దభాగం ప్రారంభమైన తొలి నిమిషంలోనే ముంబయి సిటీకి గోల్ లభించింది. 46వ నిమిషంలో ముంబయి ఆటగాడు బిపిన్ సింగ్ చేసిన గోల్‌తో స్కోర్లు సమం అయ్యాయి. అయితే కేరళ బ్లాస్టర్స్ చేసి ఫౌల్‌కు ముంబయి సిటీకి పెనాల్టీ కిక్ లభించింది. 67వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను ఆడమ్ లీ ఫాంద్రే ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మలిచాడు. దీంతో ముంబయి సిటీ జట్టు 2-1 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లింది. నిర్ణీత సమయం ముగిసే వరకు ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. దీంతో ముంబయి సిటీ జట్టు 2-1తో మ్యాచ్ గెలిచింది. సై గొడార్డ్ డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, అమరీందర్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నారు. ప్రస్తుతం 33 పాయింట్లతో ముంబయి జట్టు అగ్రస్థానంలో ఉన్నది.