- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎల్‌లో ముంబయి సిటీ జైత్రయాత్ర
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో ముంబయి సిటీ ఎఫ్‌సీ జైత్రయాత్ర కొనసాగుతున్నది. వరుస విజయాలు సాధిస్తున్న ముంబయి సిటీ శుక్రవారం రాత్రి తిలక్ మైదాన్‌లో స్పోర్ట్స్ క్లబ్ ఈస్ట్ బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 27వ నిమిషంలో ముంబయి సిటీ ఆటగాడు మోర్టదా ఫాల్ గోల్ చేశాడు.
హుగో బౌమస్ అందించిన పాస్‌ను గోల్ చేసి ముంబయి సిటీకి ఆధిక్యం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసే సమయానికి మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక గోల్ నమోదయ్యింది. దీంతో ముంబయి సిటీ 1-0 తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ముంబయి క్లబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. హుగో బౌమస్‌కు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, మోర్టదా ఫాల్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.