- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా డ్యూటీల్లో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులు!
దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ వైద్య సిబ్బంది కొరత తీవ్రమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసుకుని పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారిని కొవిడ్ చికిత్సకు వినియోగించుకోవచ్చని ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన వైద్యారోగ్య నిపుణుల సమావేశంలో నిర్ణయం జరిగింది. అధికారికంగా ప్రభుత్వం సోమవారం ఈ మేరకు ప్రకటన చేయనుంది.
బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి పరీక్షలకు హాజరుకావాల్సినవారు, ఈ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నవారిని కూడా కరోనా పేషెంట్ల సేవలో వినియోగించుకోవచ్చని సూత్రరీత్యా నిర్ణయం జరిగింది. ఇలాంటి సేవలు చేసినవారికి తగిన ప్రోత్సాహకాలను ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వడానికి నిర్ణయం జరిగినట్లు తెలిసింది.
ఇండియన్ ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ కూడా నర్సింగ్ విద్యార్థులను కరోనా పేషెంట్ల సేవలకు వాడుకోడానికి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. జిఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ), బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులను, పోస్ట్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు చేస్తున్న ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను కూడా కరోనా సేవలకు వినియోగించుకోవచ్చని అధ్యక్షుడు డాక్టర్ రాయ్ కె జార్జి, సెక్రటరీ జనరల్ ఎవిలిన్ కణ్ణన్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న నర్సుల్ని కొవిడ్ వార్డుల్లో నియమించవచ్చని, తీసుకోనివారిని వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతనే ఆ వార్డుల్లోకి పంపాలని, అప్పటివరకూ నాన్-కొవిడ్ వార్డుల్లో నియమించవచ్చని పేర్కొన్నారు. హెల్త్ కేర్ సిబ్బందికి అమలు చేస్తున్నట్లుగానే వీరికి కూడా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద సౌకర్యాలను వర్తింపజేయాలని, కొవిడ్ వార్డుల్లో పనిచేసేటప్పుడు పీపీఈ కిట్లను అందించాలని.. మొత్తం 16 రకాల అంశాలను ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా డాక్టర్లకు, నర్సులకు ఏర్పడిన కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ట్రీట్‌మెంట్ ఇస్తున్న క్రమంలో వైరస్ బారిన పడడం, పేషెంట్ల అవసరాలకు తగినంత మంది సిబ్బంది లేకపోవడం తదితరాలను పరిశీలించిన తర్వాత వైద్యారోగ్య నిపుణుల ప్రతిపాదనల మేరకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా సోమవారం ప్రకటన విడుదలకానుంది.