కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్

by Shyam |
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఎంబీబీఎస్ క‌న్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ ​అప్ కౌన్సెలింగ్​కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటకనలో పేర్కొంది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్​సైట్​ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

Advertisement

Next Story