- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాంఖడే లో "శత"క్కొట్టిన మయాంక్
దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా భారత్ , న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ తో చెలరేగాడు. మొదట్లో కాస్త తడబడ్డట్టు కనిపించినా తరువాత పుంజుకున్న మయాంక్ నిలకడగా ఆడాడు . ఓపెనింగ్ భాగస్వామ్యం 80 పరుగులతో శుభారంభం లభించినప్పటికీ , గిల్(44) పరుగులతో ఔటయ్యి పరవాలేదనిపించినా, తరువాత వచ్చిన పుజారా , కోహ్లీ వెనువెంటనే ఔటవ్వడంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. కానీ ఒక ఎండ్ నుండి మయాంక్ నిలకడగా ఆడుతూ , అయ్యర్ తో కలిసి 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే మయాంక్ 13 బౌండరీలు , 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు . ఒక తరుణంలో నిలకడ లేని ఫామ్ తో సతమతమవుతున్న మయాంక్ కి రెండో టెస్ట్ మ్యాచ్ లో జట్టు లో స్థానం వుంటదో , లేదో అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఇన్నింగ్స్ తో సెంచరీ చేసి బ్యాట్ తో అందరికి సమాధానం చెప్పాడు.