- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలం : రికార్డు ధరకు అమ్ముడుపోయిన మాక్స్‌వెల్
దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై వేదికగా ఐపీఎల్-2021 వేలం జరుగుతోంది. విదేశీ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈసారి ఎక్కువ ఖర్చు చేసేందుకు సైతం వెనకాడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్‌వెల్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. గత ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ తరఫున ఆడిన మాక్స్‌వెల్‌ను ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.14.25 కోట్లకు కోనుగోలు చేసింది.
అదేవిధంగా మరో ఆసిస్ జట్టు ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ.2.20 కోట్లకు కోనుగోలు చేసింది. గత టోర్నీలో స్మిత్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మొయిన్ అలీని రూ.7కోట్లకు చెన్నై జట్టు దక్కించుకుంది. బంగ్లాదేశ్ అల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను కోల్‌కత్తా జట్టు రూ.3.20 కోట్లకు కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇండియన్ ప్లేయర్ శివం దూబేను రూ.4.4కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.