న్యాయ వ్యవస్థ లక్ష్యమదే : మణుగూరు మేజిస్ట్రేట్‌ మౌర్యతేజ్

by Sridhar Babu |
Manuguru Magistrate Maurya Tej
X

దిశ, మణుగూరు: చట్టాలపై ప్రజలను చైతన్య పరచడం న్యాయ వ్యవస్థ లక్ష్యమని మణుగూరు నూతన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మౌర్యతేజ్ అన్నారు. మంగళవారం మండంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఆయన నూతన మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం న్యాయవాదులందరూ మౌర్యతేజ్‌కు పూలమాల వేసి, బొకేతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ నూతనంగా వచ్చిన మేజిస్ట్రేట్‌కు న్యాయవాదులందరినీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. సమాజానికి న్యాయ వృత్తి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. యువకులకు, ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయ చైతన్య సదస్సు నిర్వహించాలని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కందిమల్ల నాగేశ్వరరావు, నాగేష్, వెంకటరమణ, కవిత, జాడి చొక్కారవు, తదితర న్యాయవాదులు, ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు పూజారి, పత్రికా విలేకరులు శ్యామ్, నక్క సురేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed