దండకారణ్యంలో మావోయిస్టులకు భారీ షాక్..

by Sridhar Babu |   ( Updated:2023-12-17 14:56:26.0  )
maoists-stupam
X

దిశప్రతినిధి, కరీంనగర్ : మావోయిస్టుల ఇలాఖాలో అటు వారోత్సవాల కార్యకలాపాలు ఇటు పోలీసుల ప్రతీ చర్యలతో దండకారణ్యం అట్టుడికిపోతోంది. బుధవారం నుండి ప్రారంభమైన వారోత్సవాలలో భాగంగా మావోయిస్టులు అమరవీరులను స్మరించుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కౌంటర్ చర్యల్లో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వూ గార్డ్స్ (డీఆర్జీ) బలగాలు అమరవీరుల స్థూపాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.

దంతెవాడ జిల్లా అరన్ పూర్ స్టేషన్ ఏరియాలో 2017లో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని డీఆర్జీ బలగాలు కూల్చి వేశాయి. ఈ మేరకు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మావోయిస్టుల ప్రతీ యాక్షన్‌కు కౌంటర్‌ యాక్షన్ ఉండాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దండకారణ్య అటవీ ప్రాంతంలో నిర్మించిన స్థూపాలను కూల్చివేసే పనిలో బలగాలు నిమగ్నమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed