డేటింగ్.. 51 ఏళ్ల నటుడు.. 19 ఏళ్ల అమ్మాయి!

by Jakkula Samataha |
డేటింగ్.. 51 ఏళ్ల నటుడు.. 19 ఏళ్ల అమ్మాయి!
X

దిశ, సినిమా : టిక్ టాకర్లు హాలీవుడ్ నటులతో ఆడుకుంటున్నారు. స్టార్ల డేటింగ్ యాప్ డీటెయిల్స్ బయటపెడుతూ, వారి క్యారెక్టర్ గురించి సర్టిఫికెట్ ఇచ్చేలా చేస్తున్నారు. ఈ మధ్యే ఓ టిక్ టాక్ యూజర్.. ‘రాన’ యాప్‌లో హీరో బెన్ ఫ్లెక్స్‌ను అన్‌మ్యాచ్ చేసినందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో మెసేజ్ సెండ్ చేశాడని, ఇందుకు సంబంధించిన వీడియో లీక్ చేసింది. అది కాస్త వైరల్ కాగా, తాజాగా మరో టిక్ టాక్ యూజర్ కూడా అదే పనిచేసింది. డేటింగ్ యాప్‌లో మరో హాలీవుడ్ యాక్టర్ కన్వర్జేషన్‌ను బయటపెట్టింది.

లాస్ ఏంజిల్‌కు చెందిన కేట్ హరల్సన్‌కు 19 ఏళ్ల వయసున్నప్పుడు బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందని, ఆ సమయంలో 51 ఏళ్ల హాలీవుడ్ స్టార్ మాథ్యూ పెర్రీ ‘రాన’ డేటింగ్ యాప్‌‌లో తనతో మ్యాచ్ అయ్యాడని తెలిపింది. అప్పుడే తన ఏజ్ గురించి వివరించానన్న కేట్.. ఫేస్ టైమ్ కాల్‌లో ‘నేను నీ తండ్రిలాగే వయసులో ఉన్నానా?’ అని అడిగిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ కాగా కొందరు యూజర్స్ నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కేట్. హాలీవుడ్ నటులు టీనేజ్ గర్ల్స్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తెలిపేందుకే ఈ వీడియో షేర్ చేశానని చెప్పింది. మొత్తానికి ఈ వీడియో మాథ్యూ నిజస్వరూపాన్ని బయటపెట్టిందని, తను హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story