- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం..
దిశ, కూకట్పల్లీ: కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర పితామహుడు, శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. గణిత శాస్త్ర ప్రతిభను ప్రపంచానికి తెలియజేసిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు. శ్రీనివాస రామానుజన్గణితంలో అసాధారణ మేధాసంపత్తి కలవాడని, గణితశాస్త్రంలో రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడన్నారు.
ఆయన సంఖ్యా వాదానికి చెందిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యత కలవని అన్నారు. గణిత ఉపాధ్యాయులు పి. నర్సింహులు మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకొని గణితంలో బాగా రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత గుర్తులు +, -, ÷, ×, రామానుజన్ నెంబర్ 1729 ఆకారంలో కూర్చోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు మంజుల వాణి, దమయంతి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Tags
- Maths Day