ఐపీఎల్… నేడు హైదరాబాద్‌తో కోల్‌కత్తా ఢీ

by Anukaran |   ( Updated:2020-09-25 20:34:56.0  )
ఐపీఎల్… నేడు హైదరాబాద్‌తో కోల్‌కత్తా ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బోణీ కొట్టని రెండు జట్లు తలపడనున్నాయి. బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌పై ఓటమిపాలైన కోల్‌కత్తా జట్లు నేడు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నాయి. అయితే తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. గాయం కారణంగా లీగ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌ స్థానంలో జాసెన్‌ హోల్డర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో దొర్లిన తప్పులను సరిదిద్దుకొని రెండో పోరుకు సిద్ధంగా ఉన్నామని వార్నర్‌ అంటుంటే.. మరోవైపు కోల్‌కతా కూడా విజయంపై కోల్‌కత్తా కూడా పూర్తి ధీమాతో ఉంది. ముంబై చేతిలో ఓడిన కార్తీక్‌ సేన ఈ మ్యాచ్‌ నెగ్గి ఖాతా తెరువాలని చూస్తోంది.

Advertisement

Next Story