- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రక్షణేది ?
దిశ, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ ఎంతో ముందు చూపుతో మహిళల సంక్షేమం పట్ల ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేయకుండానే తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాలు ఉండడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా మాతాశిశు సంక్షేమ, మాతా శిశు మరణాలు అరికట్టే వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఆయా జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో అనుబంధంగా మాతా శిశు సంక్షేమాన్ని ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాలో సైతం ఈ మాతా శిశు సంక్షేమ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. అయితే, అధికారులు స్థలం విషయంలో సరియైన ప్రణాళిక లేకుండా వ్యవహరిచడంతో మాతా శిశు సంక్షేమ కేంద్రం ఇబ్బందులు ఎదుర్కోనుంది.
ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి చాలా ఇరకుగా మారింది. మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఉండడంతో దాని విస్తరణకు సైతం అవకాశం లేకుండాపోయింది. దీంతో మాతా శిశు సంక్షేమ కేంద్రానికి సంబంధించి రెండు, మూడు చోట్ల అధికారులు స్థలాన్ని గుర్తించారు. దీంట్లో భాగంగా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఐబి గెస్ట్ హౌస్, గోదావరి ఒడ్డున ఉన్న బోధన భవనములతోపాటు మరికొన్ని స్థలాలను పరిశీలించారు. ఐబి గెస్ట్ హౌస్ ప్రాంతం ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి బోధన్ భూములకి ఆ కేంద్రాన్ని మార్చారు. ఈ మేరకు నిధులు విడుదలై భవన నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది, ఇక దానిని ప్రారంభించడమే తరువాయి.
అయితే, కోట్లాది రూపాయిలు విలువైన ఈ భవనాన్ని ప్రారంభించే ముందు అధికారులు కనీసం ఆలోచించ లేకపోయారు. మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహించారు. అటు కాలేశ్వరం జలాలు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతితో, నీరంతా మంచిర్యాల కాలేజీ రోడ్ ఏరియా, ఎన్టీఆర్ నగర్‌ను ముంచెత్తుతుంది. వరద ఉధృతి పెరుగుతున్న ప్రతీసారి నీటి ప్రవాహం పెరుగుతూ ఈ భవనంలోకి నీరు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతీసారి వరద ప్రవాహం పెరిగి నేరుగా ఈ కేంద్రాలోకి చేరుతున్నాయి. వరద ఉధృతి మరింత పెరిగితే ఎల్లంపల్లి గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తేస్తే, ఈ భవనం నీట మునిగే ప్రమాదం ఉంది. అయినా అధికారులు ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా గోదావరి ఒడ్డున నిర్మించడం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.