గద్దలకొండ డైరెక్టర్‌ తమ్ముడితో ‘మాస్టర్’ నిర్మాతల సినిమా!

by Shyam |
master
X

దిశ, సినిమా: ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. తమ ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చిన తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో రికార్డులు కొల్లగొట్టిన నిర్మాతలు.. ఈ సారి కొత్త కథానాయకుడితో వచ్చేస్తున్నారు. హీరో అధర్వ మురళి యంగర్ బ్రదర్ ఆకాశ్ మురళిని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. త్వరలో కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ డీటెయిల్స్ ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటామనే ధీమాతో ఉన్నట్టు వెల్లడించారు. కాగా హీరో అధర్వ మురళి ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story