- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మంలో భారీ పేలుడు.. పోలీసులకు తప్పిన ప్రమాదం
by Sumithra |
X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ జిల్లా తనగంపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రూరల్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్‌ను తనగంపాడు వద్ద ఓ క్వారీలో పోలీసులు, ఎక్స్‌పర్ట్స్‌ల సమక్షంలో జేసీబీతో నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జేసీబీ పూర్తిగా దెబ్బతినగా, పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. కాగా, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ తంతు నిర్వహస్తుండగా.. పేలుడు సంభవించడం వెనుక పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. నిపుణుల నిర్లక్ష్యం మూలంగానే పేలుడు సంభవించిందని పలువురు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి రూరల్ ఎస్ఐ శంకర్ రావును వివరణ కోరగా.. సీపీ ఆదేశాల మేరకే పట్టుబడ్డ జిలేటిన్ స్టిక్స్ నిర్వీరం చేశామని, ఎవరికీ ప్రాణహనీ సంభవించలేదని తెలిపారు.
Advertisement
Next Story